టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర బాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హీరో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రో రైలు (హైదరాబాద్ మెట్రో)లో ఎక్కడ చూసినా నల్లటి దుస్తులు ధరించి ‘బాబు పరిచ మేసైతం’ అంటూ శాంతియుతంగా నిరసన తెలిపారు. అయితే.. హైదరాబాద్ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. బాబు మద్దతుదారులపై ఖాకీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బాబు మద్దుతులను ఎక్కడికక్కడ ఆపి పలుచోట్ల దాడులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి ఎక్కడికక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎందుకు…?
నల్ల చొక్కాలు ధరించి ప్రయాణిస్తున్న సామాన్యులపై కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల దాడిలో పలువురు చంద్రబాబు మద్దతుదారులకు గాయాలయ్యాయి. పోలీసుల అణిచివేతపై బాబు మద్దతుదారులు, ఐటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మెట్రో స్టేషన్లలోనే కాకుండా రైళ్లలో కూడా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. పోలీసులు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో రైళ్లన్నింటినీ నిలిపివేశారు. మెట్రోలో ప్రయాణిస్తున్న వారిపై పోలీసులు దాడులు చేయడంతో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల చొక్కాలు ధరించిన వారిని పోలీసులు ఈడ్చుకెళ్లడం గమనార్హం.
రా.. వెళ్దాం.. నువ్వేంటి?
‘సైకో జగన్ ఆంధ్రాలో వెళ్లాలి.. సైకిల్ రావాలి‘ అనే నినాదంతో బాబు మద్దతుదారులు నిరసనకు దిగారు. పరిపాలన దక్షత లేని సీఎం వైఎస్ జగన్‌తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెబుతున్నారు. అయితే మెట్రో కారిడార్లలో ఉండవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు ‘మెట్రోలో వచ్చేవాళ్లే.. మేం మెట్రోలో వెళ్తాం.. ఏంటి మీ సమస్య..?’ పోలీసులతో బాబు మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు.. ఇప్పుడిప్పుడే ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మెట్రో రైలులో ఎల్బీ నగర్ చేరుకుంటున్నారు. మరోవైపు ఎల్బీనగర్‌లో రోడ్లపైకి వచ్చిన చంద్రబాబు మద్దతుదారులపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. పోలీసుల విచక్షణారహిత దాడులతో పులువూరు బాబు అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా వెనక్కి తగ్గకుండా రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
నలుపు ఉంటే చాలు..!
చంద్రబాబుకు మద్దతుగా మియాపూర్ నుంచి అమీర్ పేట మెట్రో స్టేషన్ వరకు నల్ల టీ షర్టులు ధరించి వెళ్తున్న 47 మందిని పోలీసులు గుర్తించారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగి వారిని కొట్టి దూషిస్తూ తీసుకెళ్లారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఇంటర్‌ఛేంజ్ కావడంతో ఇక్కడికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో భారీ పోలీసు బలగాలను మోహరించారు. బాబు మద్దతుదారులనే కాదు.. నల్ల టీ షర్టులు ధరించిన సామాన్యులను కూడా అరెస్ట్ చేస్తున్నారని, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు మద్దతుదారులతో మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో అమీర్ పేట, ఎంజీబీఎస్ దగ్గర మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఆందోళనల మధ్య మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈలోగా చంద్రబాబుకు మద్దతుగా కారు, బైక్ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా.. ఇప్పుడు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ బాబు అనుచరులు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-14T12:51:09+05:30 IST