త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అనూహ్యంగా నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అనూహ్యంగా నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ పరంగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామానికి చెందిన ఆయన మొదటి తరం బీజేపీ నాయకుడిగా ఎదిగారు. మొదట ఏబీవీపీలో చేరి ఆ డివిజన్ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. 1983లో తొలిసారిగా మలక్ పేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో అప్పటి హోంమంత్రి ప్రభాకర్‌రెడ్డిని ఓడించారు. అనంతరం 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు చేతిలో 17,791 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 1999లో మూడోసారి ఎన్నికల్లో గెలిచిన ఇంద్రసేనారెడ్డి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఆగస్ట్ 2003లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై 2006 వరకు కొనసాగారు.2007లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.అప్పటి నుంచి పార్టీ జాతీయ కార్యవర్గంలో పని చేస్తున్నారు.
తెలంగాణపై ప్రకటన ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు
తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకోవడంలో ఇంద్రసేనారెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2005లో అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తొలిసారిగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డి ప్రధాన పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముక్కుసూటి మనిషిగా, పలు కీలక విషయాల్లో నిజాయితీగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసే నేతగా పేరున్న ఆయనకు గతంలో గవర్నర్ పదవి ఆఫర్ చేసినా సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కీలక తరుణంలో ఆయన త్రిపుర గవర్నర్‌గా నియమితులవడం బీజేపీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. కాగా, తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ ఇప్పటికే హర్యానా గవర్నర్‌గా ఉన్నారు.
ఒడిశా గవర్నర్‌గా రఘుబర్ దాస్
ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేసి.. ఇంద్రసేన, దాస్‌ల నియామకంపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
నవీకరించబడిన తేదీ – 2023-10-19T04:46:08+05:30 IST