IND vs NZ: న్యూజిలాండ్ జట్టుపై షమీ అటాక్.. భారత్ టార్గెట్ ఏంటి?

IND vs NZ: న్యూజిలాండ్ జట్టుపై షమీ అటాక్.. భారత్ టార్గెట్ ఏంటి?

వన్డే ప్రపంచకప్ 2013లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది.హెచ్ పీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (130) సెంచరీ చేయగా, రచిన్ రవీంద్ర (75) మెరుగ్గా రాణించగా.. కివీస్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్‌తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ ‘ఛాంపియన్‌ ప్రదర్శన’ ఇచ్చాడు. 10 ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

తొలుత టాస్‌ గెలిచిన భారత జట్టు బౌలింగ్‌ ఎంచుకున్న తర్వాత న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కివీస్ జట్టుకు షాక్ తగిలింది. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అప్పుడు రవీంద్ర మరియు మిచెల్ కలిసి తమ జట్టుకు మద్దతు ఇచ్చారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ.. అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ క్రీజులోకి వచ్చి చాలా సేపటి వరకు ఔట్‌ కాకపోవడంతో చివరి వరకు నిలబెడతారని అందరూ భావించారు. అప్పుడే రంగంలోకి దిగిన షమీ వీరిద్దరి జోడీని బ్రేక్ చేశాడు. రవీంద్రను పెవిలియన్‌కు పంపి వారి భాగస్వామ్యాన్ని ముగించాడు.

అప్పటి నుంచి కివీస్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. డారిల్ మిచెల్ ఒక్కడే రాణించగా, మిగతా బ్యాటర్లు క్రీజులోకి వచ్చి పెవిలియన్ బాట పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (23) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే… షమీ ఐదు వికెట్లతో కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించగా… కుల్దీప్ యాదవ్ రెండు… సిరాజ్, బుమ్రా ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 274 పరుగులు చేయాల్సి ఉంది. మరి, ఈ మంచి లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తుందా? వారు ఈ జట్టును ఓడించి వారి 2019 ప్రపంచ కప్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటారా? వేచి చూద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *