PAK Vs AFG: ప్రపంచకప్ లో మూడో సంచలనం.. పాకిస్థాన్ కు గట్టి షాక్

PAK Vs AFG: ప్రపంచకప్ లో మూడో సంచలనం.. పాకిస్థాన్ కు గట్టి షాక్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-10-23T22:17:30+05:30 IST

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్.. ఇప్పుడు పొరుగు దేశం పాకిస్థాన్ కూడా తన దెబ్బ రుచి చూసింది. సోమవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది.

PAK Vs AFG: ప్రపంచకప్ లో మూడో సంచలనం.. పాకిస్థాన్ కు గట్టి షాక్

భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్.. ఇప్పుడు పొరుగు దేశం పాకిస్థాన్ కూడా తన దెబ్బ రుచి చూసింది. సోమవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ స్కోరును ఆఫ్ఘనిస్థాన్ బ్రేక్ చేయదని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్తాన్ 49 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు గుర్భాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (87) అర్ధ సెంచరీలతో మంచి పునాది వేశారు. రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (48 నాటౌట్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది మూడో విజయం. 2015లో స్కాట్లాండ్‌పై గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని సాధించింది. గత ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ ను ఓడించి ఔరా అనిపించింది. ఇప్పుడు బలమైన బౌలింగ్ జట్టు ఉన్న పాకిస్థాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఇక పాకిస్థాన్ ఐదో స్థానానికి పడిపోయింది. దురదృష్టవశాత్తు, అక్టోబర్ 23 పాకిస్థాన్‌కు మరపురాని రోజుగా మిగిలిపోతుంది. గతేడాది ఇదే రోజున టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్, ఈ ఏడాది ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిపోయింది.

నవీకరించబడిన తేదీ – 2023-10-23T22:21:02+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *