నాగం జనార్దన్ రెడ్డి
Nagam Janardhan Reddy Resigns Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు (అక్టోబర్ 30) ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డి.. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడికి టికెట్ దక్కడంతో భంగపడ్డారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు ఠాక్రే, జానారెడ్డి చర్చలు జరిపినా నాగం జనార్దన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు.
ఒకే రోజు రెండు భారీ షాక్‌లు..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగులుతోంది. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. ఇద్దరు కీలక నేతలు ఇవాళ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఉదయం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన ఉన్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కుతుందని నాగం చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లోనూ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు షాక్.. ఆ మాజీ ఎమ్మెల్యే అనూహ్యంగా కారు ఎక్కారు
సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే సీన్..
కానీ, అతను నిరాశ చెందాడు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో నాగం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2018 ఎన్నికల్లో నాగం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ ఎస్ లోకి వెళ్లారు. మళ్లీ అదే సీన్ కనిపించింది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. దాంతో నాగం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఐదేళ్లు కాంగ్రెస్‌ను కాపాడి ఊపు తెచ్చిన తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వడం సరికాదని నాగం అంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ తొలిజాబితాలో దామోదర్ రెడ్డి కుమారుడికి నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ఇప్పటికే ఓటమిని అంగీకరించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్లు వసూలు చేస్తాం – రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నాగం రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ కు ఇది పెద్ద షాకే అని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని అంటున్నారు.