పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. శేరిలింగంపల్లి టికెట్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ
Konda Vishweshwar Reddy BJP : తెలంగాణా బీజేపీకి మరో భారీ షాక్ తగులుతుందా? మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పుడు ఈ వార్త బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. వివేక్ బాటలోనే మరో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి నడుస్తున్నట్లు తెలుస్తోంది. శేరిలింగం పల్లి సీటు విషయంలో బీజేపీ, జనసేన మధ్య పంచాయితీ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: ఏపీలో చీకట్లు, సింగిల్ రోడ్లు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. శేరిలింగంపల్లి టికెట్‌ను బీజేపీ అభ్యర్థి రవి యాదవ్‌కు కేటాయించాలని విశ్వేశ్వర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో కేవలం శేరిలింగంపల్లిలో మాత్రమే 30 శాతం ఓట్లు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకు ఈ నియోజకవర్గం కీలకం కానుంది.
ఇది కూడా చదవండి: నాకు టికెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడడమే ముఖ్యం: వివేక్
బీజేపీకి ఇప్పటికే పెద్ద షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వివేక్‌తో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ నెరవేర్చలేకపోయిందని వివేక్ అన్నారు. కేసీఆర్ కుటుంబం అభీష్టం మేరకే పని చేస్తుందన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తనకు టికెట్ కేటాయింపు అంత ముఖ్యం కాదని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే ముఖ్యమన్నారు.
బీఆర్‌ఎస్‌ను గద్దె దించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వివేక్ నమ్ముతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వివేక్ చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు.