వైఎస్ షర్మిల: పాలేరు నుంచి బరిలోకి వైఎస్ షర్మిల.. ఈ నెల 6న నామినేషన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైఎస్ ఆర్ టీపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల: పాలేరు నుంచి బరిలోకి వైఎస్ షర్మిల.. ఈ నెల 6న నామినేషన్

వైఎస్ షర్మిల పాలేరు

వైఎస్‌ షర్మిల పాలేరు: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయనున్నారు. ఈ నెల 6న పాలేరులో నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 సభలకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు. తొలుత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగారు.

పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చివరి వరకు కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.. వైఎస్ఆర్టీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఏపీలో చీకట్లు, సింగిల్ రోడ్లు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించినా.. అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చినా.. పేరు తెచ్చుకుని గట్టి పోటీ ఇచ్చే వారు లేరు. దీంతో షర్మిల ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, వైఎస్ఆర్టీపీ 15 నుంచి 20 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైఎస్ ఆర్ టీపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై ఒకట్రెండు రోజుల్లో వైఎస్ షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. 5 నెలలుగా కరెంటు లేదు.. అంటూ తెలంగాణ ప్రజలను కిషన్ రెడ్డి హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *