శాంతల: రెండో పాట వదిలేసిన రాజు.. పాట పాడింది ఎవరో తెలుసా?

శాంతల: రెండో పాట వదిలేసిన రాజు.. పాట పాడింది ఎవరో తెలుసా?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-03T19:37:46+05:30 IST

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో.. ‘ఫ్యామిలీమ్యాన్’ ఫేమ్ ఆశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో.. నీహాల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డా.ఇరంకి సురేష్ నిర్మిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. తాజాగా ఈ చిత్రంలోని ‘చెలి మొహమే’ అనే సెకండ్ సింగిల్‌ని హీరో కింగ్ నాగార్జున విడుదల చేశారు. సాంగ్ చూసిన నాగార్జున.. చాలా బాగుందని చిత్ర యూనిట్‌ని అభినందించారు.

శాంతల: రెండో పాట వదిలేసిన రాజు.. పాట పాడింది ఎవరో తెలుసా?

కింగ్ నాగార్జునతో శాంతల మూవీ టీమ్

ఇండో-అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె.ఎస్.రామారావు సమర్పణలో.. ‘ఫ్యామిలీమ్యాన్’ ఫేమ్ ఆశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో.. నీహాల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డా.ఇరంకి సురేష్ నిర్మిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కు మంచి స్పందన లభించగా.. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘చెలి మోహమే’ని హీరో కింగ్ నాగార్జున విడుదల చేశారు. సాంగ్ చూసిన నాగార్జున.. చాలా బాగుందని చిత్ర యూనిట్‌ని అభినందించారు.

ఇక ‘చెలి మోహమే’ పాట విషయానికి వస్తే… ఈ పాటను ఎస్పీబీ చరణ్ పాడారు. ‘సీతా రామం’ సినిమాలో చరణ్ పాడిన పాటలు ఇప్పటికీ మారుమోగుతున్నాయి. అతని గొంతులో మ్యాజిక్ అలాంటిది. ఈ పాట కూడా ఆయన స్వరానికి సరిగ్గా సరిపోతుంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. ‘సీతారామ్’ ఫేమ్ విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

శాంతల-Pic.jpg

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. మ శాంతల చిత్రంలోని రెండో పాటను హీరో కింగ్ నాగార్జున విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చాలా బిజీగా ఉన్నప్పటికీ సమయాన్ని వెచ్చించి మొత్తం పాటను వీక్షించి మాకు శుభాకాంక్షలు తెలిపిన ఆయనకు మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. హాలిబేడు, బేలూరులో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. నవంబర్ 17న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.(శాంతల రిలీజ్ డేట్)

ఇది కూడా చదవండి:

========================

****************************************

****************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-11-03T19:37:47+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *