తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆయన రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, వెంకన్న హుండీ గురించి ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు…
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆయన రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, వెంకన్న హుండీ గురించి ప్రస్తావించారు. అంతేకాదు ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు.
ఇది చేయి..
‘ నీతి, నిజాయితీ గల వారిని ఎన్నికల్లో గెలిపించండి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అవినీతికి పాల్పడని వ్యక్తులను ఎన్నుకోండి. కులం కోసం డబ్బు కోసం కాదు వ్యక్తి నాణ్యత కోసం ఓటు వేయండి. తాత్కాలిక ప్రలోభాలకు లొంగవద్దు.. అలా చేస్తే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుంది. దేవుడి సొమ్మును టీటీడీ హిందూ ధర్మాదాయ సంస్థలకు వినియోగించాలి. స్వామివారి ఆదాయాన్ని పురాతన ఆలయాల పునరుద్ధరణకు వెచ్చించండి‘ వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా నేతలకు, ప్రజలకు, యువతకు వెంకయ్య కీలక సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. అంతేకాదు.. సాయంత్రానికి పార్టీ మారే నేతలపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటివరకు..!!
కాగా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీల ఫిరాయింపులు, ఓట్లకు నోట్లు ఖర్చు చేయడం వంటి అంశాలపై మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి నేపథ్యం అవసరం లేదని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తే రాజకీయాల్లో రాణించవచ్చునని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కోట్లు లేకుంటే ఓట్లు రావని అన్నారు. భుజం మీద కండువా మార్చుకున్నంత తేలిగ్గా నేతలు పార్టీలు మారతారన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-03T17:09:32+05:30 IST