చివరిగా నవీకరించబడింది:
ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్ర ప్రమాద’ స్థాయికి చేరుకుంది. మొత్తంమీద సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గణాంకాల ప్రకారం గాలి నాణ్యత సూచీ 346గా నమోదైంది.

ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్ర ప్రమాద’ స్థాయికి చేరుకుంది. మొత్తంమీద, సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ గణాంకాల ప్రకారం, గాలి నాణ్యత సూచిక 346 గా నమోదైంది. లోధి రోడ్, జహంగీర్‌పురి, ఆర్కేపురం, ఐజిఐ విమానాశ్రయం T3 వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత వరుసగా 438, 491, 486 మరియు 463గా నమోదైంది.
మంచు, కాలుష్యం..(ఢిల్లీ)
ఢిల్లీ విషయానికొస్తే.. ఓ వైపు మంచు కురుస్తుంటే మరోవైపు పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ లలో రైతులు వ్యవసాయ పొలాల్లో గడ్డి తగులబెట్టడం వల్ల వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇది మనుషులకే కాదు జంతువుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి తోడు చెట్లు, మొక్కలు దెబ్బతింటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 62, సెక్టార్ 1, సెక్టార్ 116 వద్ద గాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. అనవసరమైన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా మంది దగ్గు, జలుబు, కళ్లలో నీళ్లు, కళ్లు మంటలతో బాధపడుతున్నారని నిఖిల్ మోదీ అనే వైద్యుడు వెల్లడించారు.
ఐదు రోజుల పాటు నిర్మాణ పనుల బంద్.
ఈ పరిస్థితుల దృష్ట్యా ఐదు రోజుల పాటు ఢిల్లీలో నిర్మాణ పనులు చేపట్టవద్దని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాల వల్ల వచ్చే వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్ సిగ్నల్ రాగానే ఇంజన్‌ను నిలిపివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అదనంగా, 1,000 CNG వాణిజ్య బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. దీనితో పాటు, శారీరక శ్రమ ఉండేలా N95 మాస్క్‌లు ధరించాలని సూచించారు.