శర్వానంద్: తండ్రి కాబోతున్న శర్వానంద్?.. అమెరికా ప్రయాణం

శర్వానంద్: తండ్రి కాబోతున్న శర్వానంద్?.. అమెరికా ప్రయాణం

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-06T21:29:39+05:30 IST

తెలుగు నాట సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న శర్వానంద్ నుంచి మరో శుభవార్త రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. జూన్‌లో రక్షితారెడ్డిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

శర్వానంద్: తండ్రి కాబోతున్న శర్వానంద్?.. అమెరికా ప్రయాణం

శర్వానంద్

తెలుగునాట సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న శర్వానంద్ నుంచి మరో శుభవార్త రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ హైకోర్టు న్యాయవాది కుమార్తె రక్షితారెడ్డితో శర్వా నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగింది. అయితే త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రక్షిత అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెగ్యులర్ చెకప్ ల కోసం వెళుతుండగా, శర్వానంద్ కూడా తన భార్యకు సాయం చేసేందుకు కొంతకాలంగా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ డెలివరీ అయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం. అయితే ఈ వార్తలను శర్వా లేదా అతని కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

శర్వానంద్ చివరిగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో నటించగా.. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ పాపులర్ నవల ఆధారంగా 35వ సినిమా చేస్తున్నాడు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి భార్యను దగ్గరుండి చూసేందుకు శర్వానంద్ అమెరికా వెళ్లినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

నవీకరించబడిన తేదీ – 2023-11-06T22:24:51+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *