వన్డే ప్రపంచకప్: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-11T22:03:37+05:30 IST

పాకిస్థాన్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్రదర్శన నిరాశపరిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది.

వన్డే ప్రపంచకప్: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

వన్డే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ ఓటమితో ముగించింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్రదర్శన నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84), జో రూట్ (72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్ స్టో (61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్లతో 59) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో పాకిస్థాన్‌కు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని మిగిల్చింది.

అయితే ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (0), ఫకర్ జమాన్ (1)లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. బాబర్ ఆజం (38), మహ్మద్ రిజ్వాన్ (36) రాణించినా వేగంగా ఆడలేకపోయారు. ఆఘా సల్మాన్ (51) హాఫ్ సెంచరీతో రాణించినా, అప్పటికే పాక్ ఓటమి ఖాయమైంది. చివర్లో షాహిన్ షా ఆఫ్రిది (25), మహ్మద్ వసీమ్ (16), హరీస్ రవూఫ్ (35) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా ఓటమి మార్జిన్ తగ్గినప్పటికీ విజయం దక్కలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లీ 3 వికెట్లు, రషీద్ 2 వికెట్లు, అట్కిన్సన్ 2 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో భాగంగా పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-10 జట్లు తలపడనున్నాయి.

నవీకరించబడిన తేదీ – 2023-11-11T22:03:38+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *