AUS vs BAN: బంగ్లాదేశ్ భారీ స్కోరు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఏంటి?

icc క్రికెట్ ప్రపంచ కప్ 2023 నేడు ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్ మరియు నవీకరణలు

బంగ్లాదేశ్ భారీ స్కోరు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఏంటి?

బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాకు 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహిద్ హృదయ్ అర్ధ సెంచరీతో రాణించాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. నజ్ముల్ హొస్సేన్ శాంటో 45, తాంజిద్ హసన్ 36, లిటన్ దాస్ 36, మహ్మదుల్లా 32, మెహిదీ హసన్ మిరాజ్ 29, ముష్ఫికర్ రహీమ్ 21 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, సీన్ అబాట్ రెండేసి వికెట్లు తీశారు. స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది.

ముష్ఫికర్ ఔట్.. ఐదో వికెట్ డౌన్

బంగ్లాదేశ్ 251 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. బంగ్లాదేశ్ 45 ఓవర్లలో 271/5 స్కోరుతో కొనసాగుతోంది. తౌహిద్ హృదయ్ 68, మెహిదీ హసన్ మిరాజ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మహ్మదుల్లా రనౌట్ అయ్యాడు

బంగ్లాదేశ్ 214 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మహ్మదుల్లా 32 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ 40 ఓవర్లలో 239/4 స్కోరుతో కొనసాగుతోంది.

బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. తాంజిద్ హసన్ 36, లిటన్ దాస్ 36, నజ్ముల్ హొస్సేన్ శాంటో 45 పరుగులు చేశారు.

వన్డే ప్రపంచకప్-2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం 43వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ కూడా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించనుంది. ఈ మ్యాచ్ నామమాత్రం.

చివరి జట్లు
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *