IND Vs AUS: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. రేపటి నుంచి టిక్కెట్ల విక్రయం

IND Vs AUS: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. రేపటి నుంచి టిక్కెట్ల విక్రయం

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-14T14:22:16+05:30 IST

వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత, టీం ఇండియా బీజీబీజీగా సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ నెల 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ మన ఏపీలో జరగనుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.

IND Vs AUS: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. రేపటి నుంచి టిక్కెట్ల విక్రయం

వన్డే ప్రపంచకప్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సెమీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మరి ప్రపంచ ఛాంపియన్ ఎవరో తెలియాలంటే మరో మూడు మ్యాచ్‌లు ఆగాల్సిందే. అయితే వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా బీజీబీజీగా సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ నెల 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ మన ఏపీలో జరగనుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. Insider.in వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను విక్రయించనున్నట్లు Paytm వెల్లడించింది.

మరోవైపు, ఇండియా-ఆస్ట్రేలియా టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయించబడతాయి. ఈ నెల 17, 18 తేదీల్లో విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆఫ్ లైన్ టిక్కెట్లను విక్రయించనున్నారు. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.6000 ధరల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, వన్‌టౌన్‌ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఐదు టీ20ల సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఇప్పటికే ప్రకటించగా, భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. ఆస్ట్రేలియా జట్టుకు మాథ్యూ వేడ్ నాయకత్వం వహించనున్నాడు. భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ బౌలర్లు దూరంగా ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా గతంలో ప్రకటించింది.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – 2023-11-14T14:22:17+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *