IND-W vs ENG-W 1st T20: భారత్‌కు షాక్..1వ T20లో ఇంగ్లాండ్ విజయం

India Women vs England Women 1st T20: భారత పర్యటనలో ఇంగ్లాండ్ మహిళల జట్టు శుభారంభం చేసింది.

IND-W vs ENG-W 1st T20: భారత్‌కు షాక్..1వ T20లో ఇంగ్లాండ్ విజయం

IND-W vs ENG-W 1వ T20

భారత పర్యటనలో ఇంగ్లండ్ మహిళల జట్టు శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాట్స్‌మెన్లలో షఫాలీ వర్మ (52; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. హర్మన్‌ప్రీత్ కౌర్ (26), రిచా ఘోష్ (21) ఓ మోస్తరుగా రాణించగా, స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీయగా, నాట్ స్కివర్ బ్రంట్, ఫ్రెయా కెంప్, సారా గ్లెన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. నాట్ స్కీవర్ బ్రంట్ (77; 53 బంతుల్లో 13 ఫోర్లు), డేనియల్ వ్యాట్ (75; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆఖర్లో అమీ జోన్స్ (23; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) జోరుగా ఆడింది. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు, సైకా ఇషాక్ ఒక వికెట్ తీశారు.

IND vs SA: దక్షిణాఫ్రికా టూర్‌కు ముందే టీమిండియాకు భారీ షాక్..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. భారత పేసర్ రేణుకా సింగ్ తొలి ఓవర్లోనే సోఫియా డంక్లీ (1), అలిస్ క్యాప్సీ (0)లను అవుట్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. నాట్ స్కీవర్-బ్రంట్, డేనియల్ వ్యాట్ ఇద్దరూ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆరంభంలో ఒకరితో ఒకరు ఆడుకున్న ఈ జోడీ క్రమంగా స్పీడ్ పెంచింది.

బౌలర్లపై భారత్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో డేనియల్ వ్యాట్ 34 బంతుల్లో, నాట్ స్కీవర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఇద్దరూ మరింత బలంగా బ్యాటింగ్ చేశారు. డేనియల్ వ్యాట్‌ను అవుట్ చేయడం ద్వారా సైకా ఇషాక్ ఈ జోడీని బ్రేక్ చేసింది. స్కివర్-వ్యాట్ మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. చివర్లో హీథర్ నైట్ (6) విఫలమైనప్పటికీ మీ జోన్స్ వేగంగా రాణించడంతో ఇంగ్లండ్ స్కోరు 190 పరుగులు దాటింది.

హమ్జా సలీమ్ దార్: టీ10లో ప్రపంచ రికార్డు.. 43 బంతుల్లో 193 నాటౌట్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, 24 బంతుల్లో సెంచరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *