టీ10 లీగ్: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్..?

టీ10 లీగ్: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్..?

ABN
, ప్రచురణ తేదీ – డిసెంబర్ 15, 2023 | 07:28 PM

టీ10 లీగ్: బీసీసీఐ మరో మెగా లీగ్‌ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్‌ను ప్రారంభించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచి ఈ టీ10 లీగ్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

    టీ10 లీగ్: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్..?

2008లో బీసీసీఐ ప్రవేశపెట్టిన మెగా టీ20 లీగ్ ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. ఐపీఎల్ స్ఫూర్తితో చాలా దేశాలు మెగా టీ20 లీగ్‌లను నిర్వహిస్తున్నాయి. అయితే ఇతర దేశాల కంటే బీసీసీఐపై ఎక్కువ డబ్బు వర్షం కురుస్తోంది. ఐపీఎల్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో మరో మెగా లీగ్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో టీ10 లీగ్‌ను ప్రారంభించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నుంచి ఈ టీ10 లీగ్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.టీ10 లీగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌పై బీసీసీఐ కార్యదర్శి జైషా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న విపరీతమైన ఆదరణ కారణంగా ఐపీఎల్‌కు ప్రపంచంలోనే ఏ లీగ్‌కు రానంత ఆదాయం, భారీ క్రేజ్ వస్తోంది. 10 ఫ్రాంచైజీలతో కాసుల వర్షం కురుస్తోంది.అయితే టీ10 లీగ్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అప్పగించాలా లేక కొత్త ఫ్రాంచైజీల కోసం బిడ్‌లను ఆహ్వానించాలా అని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. మరోవైపు టీ10 లీగ్‌ను భారత్‌లో నిర్వహిస్తారా లేక తటస్థ వేదికల్లో నిర్వహిస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ లీగ్‌కు అత్యుత్తమ వైట్ బాల్ క్రికెటర్లను ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఇక టీ10 లీగ్‌తో క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే మసకబారిన వన్డేలకు మరింత ఆదరణ తగ్గుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 15, 2023 | 07:28 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *