సినిమా స్థాయికి తగినన్ని థియేటర్లు ఇవ్వాలి

ABN
, ప్రచురణ తేదీ – జనవరి 05, 2024 | 06:55 AM

తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హను-మాన్. కె. నిరంజన్ రెడ్డి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల..

సినిమా స్థాయికి తగినన్ని థియేటర్లు ఇవ్వాలి

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హను-మాన్. కె. నిరంజన్ రెడ్డి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నాం. ఈ సందర్భంగా సినిమా విశేషాలను నిరంజన్‌రెడ్డి విలేకరులతో పంచుకున్నారు.

  • నిర్మాతగా నా మొదటి సినిమా ‘హనుమాన్‌’. భారీ స్థాయిలో రూపుదిద్దుకుని సంక్రాంతికి విడుదల చేయడం ఆనందంగా ఉంది. హాలీవుడ్‌లో సూపర్ హీరోల ఫ్రాంచైజీలో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఫ్రాంచైజీ ఉండేలా ఈ సినిమా చేశాం. మన సంస్కృతిలో ఆంజనేయస్వామిని మహానాయకుడిగా పరిగణించవచ్చు. సినిమా చూసిన ప్రేక్షకులందరికీ హనుమంతుడిని చూసిన అనుభూతి కలుగుతుంది.

  • ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఎక్కడా రాజీ పడకుండా కంటెంట్‌కి కావాల్సినవన్నీ అందించాం. అంతకుముందు బడ్జెట్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ‘హను-మాన్’ VFX నాణ్యత అద్భుతంగా ఉంది. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి తెరపై ప్రతిఫలం లభిస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సినిమా స్థాయి పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సినిమాకు దేశ విదేశాల్లో మంచి బిజినెస్ జరిగింది.

  • సంక్రాంతికి ఎన్ని సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నా ‘హను-మాన్’ విజయంపై పూర్తి నమ్మకం ఉంది. ఇది చాలా కాలం పాటు నడిచే సినిమా. అందుకే ముందుగా ఎక్కువ థియేటర్లలో చేయాలనే హడావుడి లేదు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిందీలో 200 స్క్రీన్లలో విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి మరిన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మా సినిమా స్థాయికి తగినన్ని థియేటర్లు ఇవ్వాలని ఇండస్ట్రీ పెద్దలను కోరుతున్నాం. ‘హను-మాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గెస్ట్‌గా వస్తున్నారు. తన బిజీ షెడ్యూల్‌లో కూడా కోటి పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వారికి ధన్యవాదాలు. ఫిబ్రవరిలో మా బ్యానర్‌లో కొత్త సినిమాలను ప్రకటిస్తాం.

నవీకరించబడిన తేదీ – జనవరి 05, 2024 | 06:55 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *