బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. మైదానంలో తన చేష్టలతో తన తోటి క్రికెటర్లతో గొడవకు దిగుతాడు. ఓ దశలో అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. మైదానంలో తన చేష్టలతో తన తోటి క్రికెటర్లతో గొడవకు దిగుతాడు. ఓ దశలో అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో గ్రేట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా.. లేనిపోని వివాదాలతో తన స్థాయిని తగ్గించుకున్నాడు. అయితే తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన షకీబ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పోలింగ్ రోజు ఓ అభిమాని చెంప కొట్టి వార్తల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షకీబ్ ఎంపీగా సక్సెస్ అయినప్పుడు బయటకు వచ్చిన ఈ వీడియో అతన్ని వివాదాల్లోకి నెట్టింది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ తరపున షకీబ్ అల్ హసన్ పోటీ చేశారు. ఆయన మగుర-1 నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆదివారం ఎన్నికల పోలింగ్ జరిగింది.
ఈ నేపథ్యంలో షకీబ్ తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌కు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. షకీబ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ అభిమాని షకీబ్ చేయి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇది ఏమాత్రం ఇష్టం లేని షకీబ్ అభిమాని విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షకీబ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, షకీబ్ అల్ హసన్ తన సమీప అభ్యర్థి కాజీ రిజాల్ హుస్సేన్‌పై 1,50,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో హుస్సేన్‌కు 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి. షకీబ్ పోటీ చేసిన అవామీ లీగ్ పార్టీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనప్పటికీ, ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ 200 సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది.
ఇలాంటివి మరిన్ని క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – జనవరి 08, 2024 | 12:16 PM