రాజస్థాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సరిగ్గా 10 రోజుల ముందు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు.

జైపూర్: రాజస్థాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సురేంద్ర పాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సరిగ్గా 10 రోజుల ముందు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఫలితంగా, సురేంద్రపాల్ సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు, రాజీనామా లేఖను ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పంపారు, అతను దానిని గవర్నర్‌కు పంపారు మరియు గవర్నర్ దానిని ఆమోదించారు. సురేంద్రపాల్ సింగ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్ భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. సోమవారం వెలువడిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ 11,283 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రూపిందర్ సింగ్ కు 94,950 ఓట్లు రాగా, సురేంద్రపాల్ సింగ్ కు 83,667 ఓట్లు వచ్చాయి.
గత నెల డిసెంబరు 30వ తేదీన సురేంద్రపాల్ సింగ్‌ను బీజేపీ నాయకత్వం తమ మంత్రివర్గంలోకి తీసుకుంది. ఆయనకు అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు, ఇందిరాగాంధీ కెనాల్ శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. కానీ ఇప్పటికీ సురేంద్రపాల్ సింగ్ ఎమ్మెల్యే కాదు. అందుకే మంత్రి పదవి పొందిన 6 నెలల్లోపు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. ఈ క్రమంలో జనవరి 5న జరిగిన కరణ్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఎన్నికల్లో ఓడిపోవడంతో మంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ మరణించడంతో ఆ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. అక్కడ జనవరి 5న పోలింగ్ జరగ్గా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్మీత్ సింగ్ కుమారుడు రూపిందర్ సింగ్ విజయం సాధించారు. మరోవైపు డిసెంబర్ 3న వెలువడిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నవీకరించబడిన తేదీ – జనవరి 09, 2024 | 10:53 AM