గుంటూరు కారం: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మహేష్ బాబు స్టామినా!

ABN
, ప్రచురించిన తేదీ – జనవరి 13 , 2024 | 02:57 PM

సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన ఈ సినిమా.. మహేష్ బాబు స్టామినా ఏంటో నిరూపించింది. సినిమా రిలీజ్ రోజే కొంత మంది నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఆ ప్రభావం కలెక్షన్స్ పై ఎక్కడా కనిపించలేదు. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ. 94 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

గుంటూరు కారం: 'గుంటూరు కారం' ఫస్ట్ డే కలెక్షన్స్.. మహేష్ బాబు స్టామినా!

గుంటూరు కారంలో మహేష్ బాబు

సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తొలిరోజే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన ఈ సినిమా.. మహేష్ బాబు స్టామినా ఏంటో నిరూపించింది. సినిమా రిలీజ్ రోజే కొంత మంది నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఆ ప్రభావం కలెక్షన్స్ పై ఎక్కడా కనిపించలేదు. ‘గుంటూరు కారం’ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రాంతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ తో అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

నిజానికి ‘గుంటూరు కారం’ తొలిరోజు సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరిగింది. కొందరు ఈ సినిమాను ‘అజ్ఞాతవాసి’తో పోల్చారు. కానీ ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫస్ట్ టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కానీ ‘గుంటూరు కారం’ సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదన్నట్లుగా నడుస్తోంది. ఇక రెండో రోజు ‘హనుమాన్’, ‘సైంధవ్’ల రూపంలో పోటీ ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా ‘గుంటూరు కారం’ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ ర్యాంపేజ్ కనిపిస్తోంది. మహేష్ కెరీర్‌లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా కూడా ‘గుంటూరు కారం’ రికార్డు సృష్టించింది. (గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్స్)

మహేష్.jpg

ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి.. మహేష్ బాబు, శ్రీలీల ఊర మాస్ స్టెప్స్.. మహేష్ బాబుని కొత్తగా ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పండగ సమయానికి సినిమా బ్రేక్ సెవెన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా ఎక్కడ లేని విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి ఎట్టకేలకు ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఏ విధంగా బోల్తా కొట్టబోతుందో తెలియాలంటే.. ఈ పండగ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి:

====================

*ప్రభాస్: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఆ అప్ డేట్ కూడా వచ్చేసింది

****************************

*’హను-మాన్’ రెస్పాన్స్ చూసి గూస్ బంప్స్ వస్తున్నాయి..

****************************

*సైంధవ్: వెంకీ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు..?

****************************

నవీకరించబడిన తేదీ – జనవరి 13, 2024 | 02:57 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *