రహానే కెరీర్ ముగిసిపోయిందని వార్తలు వస్తున్న సమయంలోనే అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అజింక్య రహానే: తాను కచ్చితంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని, 100 టెస్టు మ్యాచ్‌లు ఆడడమే తన లక్ష్యమని సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే అన్నాడు. పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన అతడు ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ ఆటగాడు ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ కావడంతో విమర్శల పాలయ్యాడు. రహానే కెరీర్ ముగిసిపోయిందని వార్తలు వస్తున్న తరుణంలో అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఐపీఎల్ 2023లో బాగా ఆడిన తర్వాత, గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో బాగా రాణించడంతో వెస్టిండీస్ టూర్‌కు ఎంపికయ్యాడు. అయితే వెస్టిండీస్ పర్యటనలో విఫలం కావడం, ఏకకాలంలో యువ ఆటగాళ్లు రావడంతో 35 ఏళ్ల సీనియర్ ఆటగాడు అవకాశాలు కోల్పోయాడు.
అతను తన ఫామ్‌ను తిరిగి పొందడానికి రంజీ ట్రోఫీ 2024 ఆడుతున్నాడు. అతను ముంబై కెప్టెన్. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆంధ్రతో రెండో మ్యాచ్‌కి జట్టులోకి వచ్చాడు. అయితే బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా జట్టును గెలిపించాడు. రహానే టీమ్ ఇండియా తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను 38.5 సగటుతో 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి.
కాగా, ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 25 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించారు. అయితే..రహానేకు మరోసారి దెబ్బ తగిలింది.
SA20 2024 : ఇలాంటి క్యాచ్ మీ జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు..! క్రికెట్ చరిత్రలో అద్భుత క్యాచ్..!
తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే. రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభమ్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ముఖేష్ కుమార్ .