ఓ విమానం గాలిలో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఓ విమానం గాలిలో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన అమెరికాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..
అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747-8 విమానం మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్యూర్టోరికోకు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇంతలో విమానం ఎడమ ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. గాలిలో ఉన్నప్పుడు ఈ లోపం సంభవించినప్పుడు, అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పి మియామీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇంజిన్‌లో మంటలు చెలరేగిన వెంటనే, విమాన సిబ్బంది అన్ని ప్రామాణిక విధానాలను అనుసరించి సురక్షితంగా మియామీ విమానాశ్రయానికి చేరుకున్నారని అట్లాస్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కార్గో విమానమేనని, ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. అదే సమయంలో, ఈ బోయింగ్ విమానం నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ GEnx ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నవీకరించబడిన తేదీ – జనవరి 19, 2024 | 04:21 PM