అయోధ్యలో రామమందిర కార్యక్రమానికి హాజరుకాకూడదన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్‌లోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీజే చావ్డా బీజాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గుజరాత్: అయోధ్యలో రామమందిర కార్యక్రమానికి హాజరుకాకూడదన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్‌లోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీజే చావ్డా బీజాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకించారు.
శనివారం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేశాను.. రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఆ వేడుకకు వెళ్లకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని.. ఆ నిర్ణయం నన్ను బాధించిందని అన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రామమందిర నిర్మాణం జరిగింది.దీనికి మనమందరం మద్దతివ్వాలి.కానీ కాంగ్రెస్‌లో ఉండి మద్దతివ్వలేకపోయాం.అందుకే నేను రాజీనామా చేస్తున్నాను” అని ఆయన అన్నారు.
అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి రాజీనామా సమర్పించారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంఖ్య 15కి పడిపోయింది. చావ్డా బీజేపీలో చేరే అవకాశం ఉంది. గతంలో ఆనంద్ జిల్లాలోని ఖంభాట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరాగ్ పటేల్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2024 | 02:24 PM