ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఐసీఐసీఐ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 25.7 శాతం పెరిగి రూ.11,052.60 కోట్లకు చేరుకుంది…

క్యూ3లో 25.7 శాతం వృద్ధి నమోదైంది
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఐసీఐసీఐ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 25.7 శాతం పెరిగి రూ.11,052.60 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల కేటాయింపులో తగ్గుదల దీనికి దోహదపడింది. ఇదిలా ఉండగా, బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం క్యూ3లో 23.6 శాతం పెరిగి రూ.10,272 కోట్లకు చేరుకుంది. గడిచిన మూడు నెలలుగా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13.4 శాతం వార్షిక వృద్ధితో రూ.18,678 కోట్లకు చేరుకుంది. అయితే నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 4.43 శాతానికి తగ్గింది. మరిన్ని విషయాలు..
-
క్రితం త్రైమాసికంలో బ్యాంకు దేశీయ రుణాలు 18.8 శాతం వృద్ధి చెందగా, ఇతర ఆదాయం 19.8 శాతం పెరిగి రూ.5,975 కోట్లకు చేరింది.
-
బ్యాంకు డిపాజిట్ల వృద్ధి 18.7 శాతం. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 86 శాతంగా నమోదైంది.
-
గత మూడు నెలల బ్యాంకు కేటాయింపులు రూ.1,049.37 కోట్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్ రూ.2,257 కోట్లకు పైగా కేటాయింపులు చేసింది.
-
గత మూడు నెలల్లో రూ.5,000 కోట్లకు పైగా రుణాలు మొండి బకాయిల విభాగంలోకి చేరాయని, వాటిలో ఎక్కువ శాతం గ్రామీణ మార్కెట్ రుణాలేనని బ్యాంక్ పేర్కొంది.
-
ఆర్‌బీఐ హెచ్చరికల తర్వాత, తనఖా రహిత వ్యక్తిగత రుణాల మంజూరుపై బ్యాంకు కూడా ఒత్తిడి తగ్గించింది. క్యూ3లో ఈ విభాగం రుణ వృద్ధి 37 శాతానికి తగ్గింది. అంతేకాకుండా, ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసిన నాన్ బ్యాంకింగ్ రుణదాతలకు నిధులు కూడా రూ.79,000 కోట్ల నుంచి రూ.74,000 కోట్లకు తగ్గించినట్లు బ్యాంక్ వెల్లడించింది.
నవీకరించబడిన తేదీ – జనవరి 21, 2024 | 02:23 AM