మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా : అభినవ్ గోమతం హీరోగా.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’!

ఈ నగరానికి ఏమైంది, సేవ్ టైగర్ చిత్రాలలో కమెడియన్‌గా పాపులారిటీ సంపాదించి తనకంటూ ఒక మార్క్‌ను సృష్టించుకున్న నటుడు అభినవ్ గోమతం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో అభినవ్ పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నై రా అనే టైటిల్ తో సినిమా చేయనున్నాడు. వైశాలి రాజ్ కథానాయిక. తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై భవానీ కాసుల, ఆరంరెడ్డి, ప్రశాంత్‌ వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత, పంపిణీదారు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి ఓ కళాశాల విద్యార్థులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా, సహాయ నటుడిగా అందరి మన్ననలు అందుకున్న అభినవ్ గోమతం ఈ చిత్రంలో నటుడిలో కొత్త కోణాన్ని, నటుడిలోని మరో కోణాన్ని చూస్తారని అన్నారు. అయోధ్యలో శ్రీ సీతారాముల ప్రాణ పతిష్ట రోజున మా మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా లోగోను ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అన్ని భావోద్వేగాల మేళవింపుతో లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ వినూత్న చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.

ఇంకా ఈ చిత్రంలో మస్తు షేడ్స్ ఉన్నై రా తరుణ్ భాస్కర్, అలీ రెజా, మోయిన్, చక్రపాణి ఆనంద్, నీలగల్ రవి, జ్యోతి రెడ్డి, లావణ్య రెడ్డి, శ్వేత అవస్థి, రవీందర్ రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, సాయికృష్ణ, ఫణి చంద్రశేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ స్వయంభు, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఆర్ట్: శరవణన్ వసంత్, కథ: అన్వర్ సాథిక్, డైలాగ్స్: రాధామోహన్ గుంటి, సంగీతం: సంజీవ్ టి, నేపథ్య సంగీతం: శ్యాముల్ అబే, ఎడిటర్ రవితేజ గిరిజాల.

నవీకరించబడిన తేదీ – జనవరి 22, 2024 | 03:21 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *