బీహార్ రాజకీయాలను పక్కన పెడితే… జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఓ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే 8 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు.
బీహార్ రాజకీయాలను పక్కన పెడితే… జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఓ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే 8 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో మన దేశంలోనే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. 2000 సంవత్సరంలో 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్.. ఆ తర్వాత తొమ్మిదోసారి సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. విశేషమేమిటంటే.. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కూడా ఈ విషయంలో వెనుకంజలో ఉన్నారు.
పదండి.. సీఎంగా ఎవరు ఎన్నిసార్లు ప్రమాణం చేశారో తెలుసుకుందాం!
-
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వీరభద్ర సింగ్ ఆరుసార్లు ప్రమాణం చేశారు. 1983లో తొలిసారి సీఎం కాగా.. 1985, 1993, 1998, 2003, 2012లో సీఎం బాధ్యతలు నిర్వహించారు.
-
తమిళనాడు దివంగత నేత జయలలిత కూడా 6 సార్లు సీఎం అయ్యారు. 1991లో తొలిసారి సీఎం అయిన ఆమె.. 2001, 2002, 2011, 2015, 2016లో తమిళనాడు సీఎంగా పనిచేశారు.
-
సిక్కిం నుంచి పవన్ కుమార్ చామ్లింగ్ వరుసగా 5 సార్లు సీఎంగా కొనసాగారు. 1994లో తొలిసారి సీఎం అయ్యి.. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
-
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు 1977 నుంచి 2000 వరకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, ఆయన ఐదుసార్లు మాత్రమే ప్రమాణం చేశారు.
-
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ 5 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1980లో తొలిసారి సీఎం అయ్యాడు.. 1985, 1990, 1995, 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
-
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2000లో తొలిసారి సీఎం అయ్యాడు.. అప్పటి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 28, 2024 | 03:40 PM