ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు.

IND vs ENG జో రూట్ వైజాగ్ టెస్ట్‌లో చారిత్రాత్మక మైలురాయిని కళ్లకు కట్టాడు
జో రూట్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ అరుదైన రికార్డు సాధించాడు. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో 138 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 19,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లిష్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఓవరాల్‌గా 14వ బ్యాటర్‌గా నిలవనున్నాడు. రూట్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 339 మ్యాచ్‌లు ఆడాడు. అతను 66.41 స్ట్రైక్ రేట్‌తో 48.24 సగటుతో 18,862 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 104 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 34,357 పరుగులతో సచిన్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, మహేల జయవర్ధనే, జాక్వెస్ కలిస్, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా, సనత్ జయసూర్య, చంద్రపాల్, ఇంజమామ్ ఉల్ హక్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ 19 వేలకు పైగా పరుగులు చేశారు.
అశ్విన్: విశాఖ టెస్టు.. అశ్విన్ ఏ రికార్డులు నెలకొల్పాడో తెలుసా..?
బ్యాటింగ్‌లో వైఫల్యం..
రూట్ విషయానికి వస్తే… హైదరాబాద్ వేదికగా ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రూట్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 60 బంతులు ఎదుర్కొన్న రూట్ కేవలం ఒక ఫోర్, 29 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బుమ్రా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగి 6 బంతులు ఆడిన తర్వాత కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.
బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు బౌలింగ్‌లో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రూట్ నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. మొత్తం ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్టు మ్యాచ్ జరిగే విశాఖ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రూట్ బౌలింగ్ ను భారత బ్యాట్స్ మెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.