రాజస్థాన్ నుంచి పోటీ.. కర్ణాటక నుంచి తయారు
గుజరాత్‌కు చెందిన నడ్డా. మహారాష్ట్రకు చెందిన చవాన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీ భవనంలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ సీఎం అశోక్ గహ్లోత్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధుల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుండడంతో రాజ్యసభలో ఒక్క సీటును గెలుచుకునే సంఖ్యా బలం కాంగ్రెస్‌కు ఉంది. ప్రస్తుతం ఆమె రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌సభకు తన చివరి ఎన్నికను సోనియా ప్రకటించారు. దీంతో ఆమె ఇప్పుడు తొలిసారిగా రాజ్యసభలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ సింఘ్వీ రాజ్యసభకు పోటీ చేయనున్నారు. అలాగే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ సన్నిహితుడు డాక్టర్ అజయ్ మాకెన్‌తో పాటు డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అలాగే మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఒడిశా నుంచి కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ నుంచి ఎల్.మురుగన్ రాజ్యసభలో నిలబడనున్నారు. ఈ మేరకు బీజేపీ అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసింది. 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.