బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరో. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా రూపొందుతున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. హృతికా శ్రీనివాస్ కథానాయిక. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మరియు శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయశంకర్ సమర్పిస్తున్నారు. సంజయ్ షెరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది చిత్ర టీజర్‌ను విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
టీజర్ విడుదల అనంతరం సంపత్ నంది మాట్లాడుతూ.. గతంలో కొన్ని చిత్రాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాను. అదే విధంగా ఈ చిత్రానికి సమర్పకుడిగా జయశంకర్ వ్యవహరిస్తున్నారు. నేను ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. ‘సౌండ్ పార్టీ’ విషయానికి వస్తే.. టీజర్ చాలా బాగుంది. అలాగే మోహిత్ సంగీతం చాలా బాగుంది. ఈ సినిమా మరో ‘జాతిరత్నాలు’ సినిమాగా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజీకి ఇది మంచి సినిమా అవుతుంది. అందరూ చేతిలో సెల్ ఫోన్, సిగరెట్ పట్టుకుని తిరుగుతారు.. కానీ జయశంకర్ మాత్రం పుస్తకం పట్టుకుని తిరుగుతారు. ఈ క్వాలిటీ నచ్చి ‘పేపర్ బాయ్’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాను. ఈ సౌండ్ పార్టీ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. (సౌండ్ పార్టీ మూవీ టీజర్ లాంచ్)
సెప్టెంబర్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించడంతోపాటు కొత్తతరం కథాంశాలతో సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌ను స్థాపించాం. మా బ్యానర్ నుంచి వరుసగా సినిమాలు వస్తాయని నిర్మాత రవి పొలిశెట్టి అన్నారు. సంగీత దర్శకుడు మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం రావడానికి ప్రధాన కారణం సన్నీ. అలాగే జయశంకర్ గారు, మా దర్శకుడు సంజయ్ గారు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి మంచి మ్యూజిక్ చేయడానికి సహకరించారు. సంపత్ నందిగారు వచ్చి మా టీజర్‌ని లాంచ్ చేసి మా టీమ్‌ని ఆశీర్వదించారు.
సమర్పకుడు జయశంకర్ మాట్లాడుతూ.. మా హీరో వీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సంపత్ నందిగారు వచ్చి మా ‘సౌండ్ పార్టీ’ సినిమా టీజర్ లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంపత్ నందిగారి వల్లే నేను సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. దర్శకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది ఆయనే. సంపత్‌గారు ఎప్పుడూ చెబుతుండేవారు, మొదటి నుంచి మనతో పాటు ప్రయాణించే వారికి, తోడుగా ఉండేవారిని మనం కూడా ఆదరించాలని. అందులో భాగంగానే ఇది నేను చేయాల్సిన సినిమా అయినప్పటికీ… నిర్మాతలను ఒప్పించి మా అన్న సంజయ్ తో ఈ సినిమా చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చితే సంజయ్ నుంచి ఏక్ జంధ్యాల, ఈవీవీ గారి లాంటి ఎన్నో సినిమాలు వస్తాయని కచ్చితంగా చెప్పగలను. టీమ్ అంతా ఇంతలా సపోర్ట్ చేసిందని.. ‘బాహుబలి లాంటి కథ రాసుకున్నా మన వెనుక ఓ శక్తి ఉండాలి. జయశంకర్ అన్న అంత బలం. ఆయన వల్లే ఈ సినిమా ఇంతటి స్థాయికి చేరుకుంది. మా టీమ్ సపోర్ట్ వల్లే 28 రోజుల్లో సినిమాను పూర్తి చేయగలిగామని దర్శకుడు సంజయ్ షెరి తెలిపారు.
హీరో వీజే సన్ని మాట్లాడుతూ.. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. జయశంకర్ సపోర్ట్ తో సంజయ్ చాలా బాగా చేసాడు. శివన్నారాయణగారు, నేను తండ్రీకొడుకులుగా నటించాం. మేమిద్దరం సినిమా అంతా పెద్దగా నవ్వుకుంటాం. మోహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అందరూ కుటుంబ సమేతంగా వెళ్లి మా చిత్రాన్ని చూసి పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
*******************************************
*******************************************
*******************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-08-18T20:22:50+05:30 IST