IND Vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం రెండో టీ20 జరగనుంది. అయితే గత కొన్ని రోజులుగా తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉందని, మధ్యాహ్నం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అట్టహాసంగా ప్రారంభమైంది. వరల్డ్‌కప్ ఫైనల్‌లో టీమ్‌ఇండియా ఓడిపోవడంతో అభిమానులకు నిరాశే మిగిలింది. దీంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను పట్టించుకోలేదు. కానీ తొలి టీ20 వారి మైండ్ సెట్‌ను కాస్త మార్చగలిగింది. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసినా.. టీమ్ ఇండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానులకు వినోదాన్ని పంచింది. ఇప్పుడు అభిమానుల దృష్టి తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20పైనే ఉంది. అయితే ఈ మ్యాచ్‌కి అవకాశాలు చాలా తక్కువ. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయ్యే పరిస్థితులు ఉన్నాయి. తిరువనంతపురంలో శనివారం కురిసిన భారీ వర్షానికి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని మైదానం చిత్తడిగా మారింది. ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉందని, మధ్యాహ్నం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కానీ సాయంత్రానికి మేఘాలు కమ్ముకుని మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురవకపోవచ్చు. భారీ వర్షం కురిస్తే మైదానం ఎంత త్వరగా ఆరిపోతుందనే దానిపై మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం ఆధారపడి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరువనంతపురంలో వర్షం కారణంగా మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడడం ఇదేం కొత్త కాదు. వన్డే ప్రపంచకప్‌కు ముందు తిరువనంతపురంలో జరగాల్సిన అన్ని వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా ఆడకుండానే మెగా టోర్నీలో టీమిండియా అడుగుపెట్టిన విషయాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – 2023-11-25T20:03:38+05:30 IST