నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన సినీ అభిమానుల్లో ఆసక్తిని రేపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు.

రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన సినీ అభిమానుల్లో ఆసక్తిని రేపింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘చిల సౌ, మన్మథుడు 2’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీనింగ్. విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు. చిత్ర సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దర్శకుడు మారుతి కెమెరా స్విచాన్ చేశారు. ‘బేబీ’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సాయి రాజేష్ తొలి షాట్‌కి దర్శకత్వం వహించాడు. వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ.. ప్రస్తుత ట్రెండ్‌కి కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి:
====================
*************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-11-28T13:30:09+05:30 IST