భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు ప్రకటించిన మూడు రోజుల్లోనే ఆమె మాజీ భర్త షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను తాను వివాహం చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన విడాకుల గురించి పోస్ట్ చేసిన మూడు రోజుల్లో, ఆమె మాజీ భర్త షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను తాను వివాహం చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అతను పెళ్లి ఫోటోలను (షోయబ్ మాలిక్ వివాహం) కూడా పంచుకున్నాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారు
షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. అయేషా సిద్ధిఖీతో విడాకులు తీసుకున్న షోయబ్.. 2010లో సానియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. గత రెండేళ్లుగా షోయబ్, సానియా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వారిద్దరూ స్పందించలేదు. గత సంవత్సరం, షోయబ్ సనా జావేద్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె సన్నిహిత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటి నుండి, షోయబ్ మరియు సనా డేటింగ్ గురించి వార్తలు మొదలయ్యాయి.
కాగా, గత బుధవారం సానియా తమ విడాకుల గురించి సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. “పెళ్లి కష్టమే, విడాకులు తీసుకోవడం కూడా కష్టమే… మీకు నచ్చిన కష్టమైన భాగాన్ని ఎంచుకోండి. లావుగా ఉండటం కష్టం, ఫిట్‌గా ఉండటం కష్టం… నచ్చిన కష్టాన్ని ఎంచుకోండి. అప్పు కష్టం, ఆర్థిక క్రమశిక్షణ కష్టం.. నచ్చిన కష్టాన్ని ఎంచుకోండి. వ్యక్తీకరించడం కష్టం, వ్యక్తీకరించకపోవడం కష్టం.. మీకు నచ్చిన కష్టాన్ని ఎంచుకోండి. జీవితం ఎప్పుడూ రోజీగా ఉండదు, కఠినంగా ఉంటుంది. కానీ మనకు నచ్చిన కష్టాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఆ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాలి” అని సానియా పేర్కొంది.
నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2024 | 01:56 PM