పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బుధవారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు జరిగాయి. అయితే మక్వాల్ సరిహద్దు ఔట్ పోస్ట్ వద్ద భారత బలగాలు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన కాల్పులు 20 నిమిషాల పాటు కొనసాగాయి.

జమ్మూ: పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బుధవారం కాల్పులు జరిగాయి. అయితే మక్వాల్ సరిహద్దు ఔట్ పోస్ట్ వద్ద భారత బలగాలు పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన కాల్పులు 20 నిమిషాల పాటు కొనసాగాయి. పాక్ పోస్ట్ అఫ్జల్ సాహిద్ (13 వింగ్ సిఆర్) నుంచి ఈ కాల్పులు జరిగినట్లు గుర్తించామని, ఈ కాల్పుల్లో భారత భూభాగానికి ఎలాంటి నష్టం జరగలేదని వారు వివరించారు.
చివరిసారి నవంబర్ 2023లో..
చివరిసారిగా గత ఏడాది నవంబర్ 2023లో సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు. 2021 ఫిబ్రవరి 25 తర్వాత భారత వైపు జవాన్ ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. అలాగే 26 అక్టోబర్ 2023న జమ్మూలోని అర్నియా సెక్టార్లో సరిహద్దు కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు మరియు ఒక పౌరుడు గాయపడ్డారు. అక్టోబరు 17న జరిగిన కాల్పుల్లో మరో బీఎస్ఎస్ జవాన్ గాయపడ్డాడు.
ప్రధాని పర్యటనకు ముందు…
కాగా, ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు.దీనికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పాక్ బలగాలు బుధవారం కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. షెడ్యూల్ ప్రకారం, ప్రధాని తన పర్యటనలో భాగంగా జమ్మూలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 14, 2024 | 08:38 PM