దేశ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్యాలయాలు, రాజకీయ పార్టీలు

– సముదాయాలు, దేవాలయాల వద్ద ప్రత్యేక నిఘా
పెరంబూర్ (చెన్నై): దేశ ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అదే సమయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పది రోజుల పాటు పోలీసులకు సెలవులు ఉండవని ఇప్పటికే ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేను తేదీకి ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పోలీసులు బందోబస్తు విధుల్లో చేరనున్నారు. ఒక్క చెన్నైలోనే 15 వేల మంది భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర డీజీపీ శంకర్ జీవల్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
చెన్నై నగర పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ నగరంలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయాలని ఇన్స్పెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ట్రిప్లికేన్, పెరియమేడు, ఎగ్మూర్, కోయంబేడు సహా అన్ని ప్రాంతాల్లోని లాడ్జీల్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనే అంశాన్ని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం ముగిసే వరకు అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే సెలవు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వాణిజ్య సముదాయాలు, దేవాలయాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు నిఘా కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-09T08:38:47+05:30 IST