నిరుద్యోగులకు శుభవార్త.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్






నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మెన్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం మార్చి 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25 చివరి తేదీ. అర్హత మరియు ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం 9,212 పోస్టులు ఉండగా అందులో 428 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో, 307 పోస్టులు తెలంగాణలో ఉన్నాయి.

దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. CBT పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 20 నుండి 25 వరకు విడుదల చేయబడతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) జూలై 1 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్/హిందీలో ఉంటుంది.

కాగా, కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు వయోపరిమితి 21 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, మాజీ సైనికులకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు పే స్కేల్: రూ.21,700 నుండి రూ.69,100. CRPF రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారిక వెబ్‌సైట్ www.crpf.nic.inలో చూడవచ్చు. ఇక.. పదోతరగతి విద్యార్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *