నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా MBBS, BDS, BAMS, BSMS, BUMS, BHMS కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేట్/అనుబంధ మెడికల్/డెంటల్/ఆయుష్ కళాశాలలు; డీమ్డ్ యూనివర్సిటీలు; AIIMS మరియు JIPMER విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 15 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద రిజర్వ్ చేయబడ్డాయి.
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్/ XII/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) నుండి సమానత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అభ్యర్థులు డిసెంబర్ 31, 2006లోపు జన్మించి ఉండాలి.
NEET UG 2023 వివరాలు: ఈ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఇంగ్లిష్‌ని ఎంపిక చేసుకుంటే ప్రశ్నపత్రం ఇంగ్లీషు భాషలో మాత్రమే ఇవ్వబడుతుంది. మిగిలిన వారికి ఎంచుకున్న భాషతో పాటు ఇంగ్లిష్‌లోనూ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో మొత్తం 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ఒక్కొక్కటి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 35 ప్రశ్నలు ఇస్తారు. వీటన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. రెండో విభాగంలో 15 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏదైనా పదికి సమాధానాలు గుర్తించండి. పది కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఉంటే మొదటి పది సమాధానాలు మాత్రమే పరిగణించబడతాయి. అభ్యర్థులు OMR షీట్‌లో బాల్ పాయింట్ పెన్‌తో సమాధానాలను గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు 720. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటల ఇరవై నిమిషాలు.
దరఖాస్తు రుసుము: సాధారణ అభ్యర్థులకు రూ.1700; EWS మరియు OBC అభ్యర్థులకు 1600; వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000; విదేశీ అభ్యర్థులకు 9,500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 6
NEET UG తేదీ: మే 7
వెబ్‌సైట్: neet.nta.nic.in
నవీకరించబడిన తేదీ – 2023-03-16T16:55:07+05:30 IST