చివరిగా నవీకరించబడింది:
ప్రతి సంవత్సరం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ కోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్’ పరీక్ష నిర్వహిస్తారు. 2023కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది.

IBPS RRB 2023: ప్రతి సంవత్సరం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ కోసం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్’ పరీక్ష నిర్వహిస్తారు. 2023కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది. 8,612 కంటే ఎక్కువ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో పీఓ, క్లర్క్, ఆఫీసర్స్ స్కేల్ 2వ మరియు 3వ స్థాయి పోస్టులు ఉన్నాయి.
గడువు జూన్ 21
IBPS ఈ పోస్టులను కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII ద్వారా భర్తీ చేస్తుంది. ఖాళీలు గ్రూప్ A- ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) మరియు గ్రూప్ B- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల క్రింద విభజించబడ్డాయి. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్ 1న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 21.
నోటిఫికేషన్ వివరాలు..(IBPS RRB 2023)
జూన్ 1 నుంచి జూన్ 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దరఖాస్తులో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉంది.
జూన్ 10వ తేదీ నుంచి ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
17 నుంచి 22 వరకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ (పీఈటీ) ఉంటుంది.
ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష 2023 ఆగస్టులో నిర్వహించబడుతుంది.
ప్రిలిమ్స్ ఫలితాలు సెప్టెంబర్, 2023లో ప్రకటించబడతాయి.
మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్, 2023లో ఉంటుంది.
మెయిల్స్ ఫలితాలు అక్టోబర్, 2023లో ప్రకటించబడతాయి.
ఇంటర్వ్యూలు అక్టోబర్/నవంబర్, 2023లో నిర్వహించబడతాయి.
తాత్కాలిక కేటాయింపు జనవరి 2024న జరుగుతుంది.
పరీక్ష ఫీజు, పరీక్ష విధానం, ఖాళీల వివరాలు, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, పోస్ట్‌ను అనుసరించి అవసరమైన అర్హతలను నోటిఫికేషన్‌లో తనిఖీ చేయవచ్చు.
నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.