ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల..

ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల..

చివరిగా నవీకరించబడింది:

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెట్ గత నెల 15 నుంచి 24 వరకు జరిగింది. ఇందులో భాగంగా ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి

AP EAPCET ఫలితాలు 2023 : AP EAP సెట్ ఫలితాలు విడుదల..

AP EAPCET ఫలితాలు 2023: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెట్ గత నెల 15 నుంచి 24 వరకు జరిగింది. ఇందులో భాగంగా ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3.15 లక్షలకు పైగా (93.38 శాతం) విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంజినీరింగ్‌లో 76.32 శాతం, అగ్రికల్చర్‌ కోర్సుల్లో 89.65 శాతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష ఫలితాలు cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చని వెల్లడించారు ఇంజినీరింగ్ విభాగంలో ఉమేష్ వరుణ్ మొదటి ర్యాంకు సాధించగా.. తెలంగాణ ఎంసెట్ లో కూడా ఉమేష్ వరుణ్ మూడో ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌లో నీట్‌ టాపర్‌గా నిలిచిన వరుణ్‌కు రెండో ర్యాంక్‌ వచ్చింది.

ఇంజనీరింగ్‌లో టాప్ ర్యాంకర్‌లు (AP EAPCET ఫలితాలు 2023)..

  1. చల్లా ఉమేష్ వరుణ్- 158 మార్కులు
  2. అభినవ్ చౌదరి- 157 మార్కులు
  3. నందిపాటి సాయి దుర్గా రెడ్డి -155 మార్కులు
  4. తపతి బాబు సృజన్ రెడ్డి- 155 మార్కులు
  5. దుగ్గినేని వెంకట యోగేష్- 150 మార్కులు
  6. అడ్డగడ్డ వెంకట శివరామ్ – 153 మార్కులు
  7. ఎక్కింటి ఫణి వెంకట మణిచంద్రారెడ్డి 153 మార్కులు
  8. మేడాపురం లక్ష్మీ నరసింహ భరద్వాజ 153 మార్కులు
  9. శశాంక్ రెడ్డి- 152 మార్కులు
  10. ఎం శ్రీకాంత్- 152 మార్కులు

(AP EAPCET ఫలితాలు 2023) వ్యవసాయ విభాగంలో ర్యాంకర్‌లు..

  1. సత్యరాజు జస్వంత్ (ఫస్ట్ ర్యాంక్)
  2. వరుణ్ చక్రవర్తి (రెండో ర్యాంక్)
  3. రాజ్ కుమార్ (తృతీయ ర్యాంక్)
  4. సాయి అభినవ్ (4వ ర్యాంక్)
  5. కార్తికేయ రెడ్డి (5వ ర్యాంక్)


ఇది కూడా చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *