తమీమ్ ఇక్బాల్: బంగ్లాదేశ్ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-06T15:04:41+05:30 IST

బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తమీమ్ ఇక్బాల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో కెరీర్ ప్రారంభించిన అతను మూడు ఫార్మాట్లలో కలిపి 15 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 14 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి.

    తమీమ్ ఇక్బాల్: బంగ్లాదేశ్ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రతిష్టాత్మకంగా జరగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఉలిక్కిపడింది. వన్డే ప్రపంచకప్‌కు 100 రోజులు మాత్రమే మిగిలి ఉండగానే కెప్టెన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై పలువురు క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇది కూడా చదవండి: రింకూ సింగ్‌కు అన్యాయం.. బీసీసీఐపై విమర్శల వర్షం

ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడుతోంది. కానీ తొలి వన్డేలో బంగ్లాదేశ్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 169 పరుగులు చేసినప్పటికీ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్థాన్ లక్ష్యాన్ని కుదించారు. దీంతో జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఓటమి తర్వాత వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

తమీమ్ ఇక్బాల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 70 టెస్టులు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో కెరీర్ ప్రారంభించిన అతను మూడు ఫార్మాట్లలో కలిపి 15 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 14 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి.

రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్ ముగింపు దశకు చేరుకుందని.. ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని తనకు అండగా నిలిచిన బీసీబీ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు. 16 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో తదుపరి అధ్యాయం సాఫీగా సాగేందుకు ప్రార్థించాలని అభిమానులను కోరాడు. కాగా, తమీమ్ ఇక్బాల్ వారసుడు రేసులో లిటన్ దాస్, షకీబుల్ హసన్ ఉన్నారు.

నవీకరించబడిన తేదీ – 2023-07-06T15:07:24+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *