ఆసియా కప్ లీగ్ దశలో భాగంగా, సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌కి సంబంధించిన మొదటి దశ టిక్కెట్ విక్రయాలను పీసీబీ శుక్రవారం ప్రారంభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు విక్రయం ప్రారంభమైన గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 35 వేల టిక్కెట్లను విక్రయానికి అందుబాటులో ఉంచగా వాటిని దక్కించుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ జరగనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ ఏడాది ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో జరుగుతోంది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది, అయితే భద్రతా కారణాల దృష్ట్యా, ఆసియా కౌన్సిల్ కూడా శ్రీలంకలో టీమిండియా కోసం మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఆగస్టు 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే ఈ టోర్నీలో పాత ప్రత్యర్థుల మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇది కూడా చదవండి: వన్డే ప్రపంచకప్: ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి.. చరిత్రలో ఇదే తొలిసారి..!!
ఆసియా కప్ లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలను పీసీబీ శుక్రవారం ప్రారంభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు విక్రయం ప్రారంభమైన గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 35 వేల టిక్కెట్లను విక్రయానికి అందుబాటులో ఉంచగా వాటిని దక్కించుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ మ్యాచ్ కు ఒక్కో టికెట్ ధర రూ.2,500 అని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనడం లేదు. ఫలితంగా, ఈ జట్లు కేవలం ఆసియా కప్ మరియు ICC ఈవెంట్లలో మాత్రమే తలపడతాయి. దీంతో టిక్కెట్‌లకు డిమాండ్ భారీగా ఉంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ ధరలు సాధారణ మ్యాచ్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాన్ని పీసీబీ ఇటీవల ప్రారంభించింది. ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనుండగా, పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి.
నవీకరించబడిన తేదీ – 2023-08-19T17:24:49+05:30 IST