మహారాష్ట్ర: సెప్టెంబర్ లో సీఎం మార్పు… జోస్యం చెప్పిన కాంగ్రెస్..!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-19T15:10:11+05:30 IST

మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, సెప్టెంబర్‌లోగా మార్పులు వస్తాయని, సీఎం పీఠం ప్రమాదంలో పడుతుందని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ శనివారం జోస్యం చెప్పారు.

మహారాష్ట్ర: సెప్టెంబర్ లో సీఎం మార్పు... జోస్యం చెప్పిన కాంగ్రెస్..!

ముంబై: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, సెప్టెంబర్‌లోగా మార్పులు వస్తాయని, సీఎం పీఠానికి ప్రమాదం తప్పదని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ జోస్యం చెప్పారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మహారాష్ట్రలో ఇప్పటి వరకు ఏం జరగలేదని, ఈ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని అన్నారు. సీఎం పీఠానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. సెప్టెంబరులో ముఖ్యమైన కుర్చీ (సీఎం కుర్చీ)లో మార్పు ఉంటుందన్నారు.

సర్కార్ కొనసాగింపుపై ఊహాగానాలు

బిజెపి, శివసేన, ఎన్‌సిపి (అజిత్‌ పవార్‌ వర్గం) ప్రభుత్వాలు ఎంతకాలం మనుగడ సాగిస్తాయనే దానిపై కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి పీఠానికి ముప్పు పొంచి ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ తన 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి జులై 2న మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత నెలలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ షిండే స్థానంలో అజిత్ పవార్‌ను సీఎం చేస్తున్నారన్నారు. అయితే, ఆయన వాదనను బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. షిండే ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని, ఆయనే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. జూలై 2022లో, శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగురవేసి పార్టీని చీల్చడంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో షిండే బీజేపీతో పొత్తు పెట్టుకుని సీఎం పదవి చేపట్టారు.

నవీకరించబడిన తేదీ – 2023-08-19T15:10:11+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *