కెరీర్‌లో ఎన్నో బంపర్ హిట్స్‌ని అందించిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో త్వరలో కోలీవుడ్‌కి చెందిన దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో చరణ్ ఉన్నట్లు టాలీవుడ్ టాక్.

బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుడితో తదుపరి చిత్రాన్ని కూడా ప్లాన్ చేయనున్నారు
రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌తో బుచ్చిబాబు దర్శకత్వంలో తదుపరి చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమా ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్.. కోలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడట. అందుకే తమిళంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో మాటలు కలపడం ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. శంకర్ తర్వాత రామ్ చరణ్ మరో కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్నాడని సమాచారం.
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కెరీర్‌లో ఎన్నో బంపర్ హిట్స్‌ని అందించిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో త్వరలో కోలీవుడ్‌కి చెందిన దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో చరణ్ ఉన్నట్లు టాలీవుడ్ టాక్.
రీసెంట్ గా దర్శకుడు శంకర్ బర్త్ డే వేడుకలకు వెళ్లిన రామ్ చరణ్… తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నెల్సన్ దిలీప్ కుమార్ లతో చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శంకర్ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్ ఈ ముగ్గురు దర్శకులతో మాట్లాడి కథ బాగుంటే సినిమా చేయడానికి సిద్ధమని సూచించాడట.
ఆ ముగ్గురు దర్శకులకు కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. కలెక్షన్ల వర్షం కురిపించిన విక్రమ్, మాస్టర్ వంటి చిత్రాలను తీసి హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తలైవర్ రజనీతో జైలర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కార్తీక్ సుబ్బరాజు కూడా మంచి హిట్ సినిమాలు చేశాడు. రామ్ చరణ్ కాంబో సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న అంచనాలతో మంచి కథను తయారు చేయమని కోరాడు. ఈ ముగ్గురు దర్శకులతో రామ్ చరణ్ చర్చలు జరపడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
శ్రీలీల : రష్మిక మందన్న స్థానంలో కూడా శ్రీలీల.. నితిన్ సినిమాలో రష్మిక ఔట్.. శ్రీలీల ఇన్..
ఇక తమిళ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఫోటో దిగారు కానీ అందులో తెలుగు హీరో రామ్ చరణ్ ఒక్కడే ఉండటం అందరిని ఆశ్చర్య పరిచింది. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ తో సినిమా చేస్తానని లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించారు. మరి రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ తో మళ్లీ సినిమా చేస్తాడో లేదో చూద్దాం.