CWC : 39 మందితో CWC

ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా

సచిన్ పైలట్, శశి థరూర్, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు

జి-23 అసమ్మతి నేతలకు బుజ్జగింపు

ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డికి స్థానం

శాశ్వత ఆహ్వానితుల జాబితాలో దామోదర,

టి.సుబ్బిరామి రెడ్డి, కొప్పుల రాజు స్థానం

ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్‌

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎక్స్ అఫీషియో

సభ్యులుగా వివిధ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే జాబితాను ప్రకటించారు

84 మందిలో 15 మంది మహిళలు

అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండేలా కమిటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పది నెలల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడీడబ్ల్యూసీ) పునర్వ్యవస్థీకరణ జరిగింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఈ కమిటీని ఆదివారం ప్రకటించారు. ఈ కమిటీలో ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా గతంలో నాయకత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జీ-23 నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మలకు కూడా చోటు కల్పించారు. 39 మంది రెగ్యులర్ సభ్యులతో పాటు 32 మందికి శాశ్వత ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. వీరిలో 12 మంది వివిధ రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్‌లు. వీరితో పాటు మరో 13 మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.

వీరిలో యువజన కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షురాలు, సేవాదళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఒక్కరే సాధారణ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. శాశ్వత ఆహ్వానితుల జాబితాలో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఏపీ నేతలు టి.సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజులకు చోటు దక్కింది. కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, తెలంగాణలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చోటు దక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఏర్పడింది.

అసమ్మతి నేతలకు కూడా అవకాశం..

పార్టీలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పలువురు నేతలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కు చోటు కల్పించకుండా ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను సీడబ్ల్యూసీలో చేర్చుకోవడం గమనార్హం. ఇక ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఖర్గేపై పోటీ చేసిన కేరళ నేత శశిథరూర్, జీ-23 గ్రూపులో భాగంగా సోనియాకు అసంతృప్తి లేఖ రాసిన హిమాచల్ ప్రదేశ్ నేత ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్‌లకు వర్కింగ్స్‌లో చోటు కల్పించారు. కమిటీ వీరితో పాటు బెంగాల్ దివంగత నేత ప్రియరంజందాస్ మున్షీ భార్య దీపాస్ మున్షీ, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్‌లకు కార్యవర్గంలో కొత్త అవకాశం లభించింది. సీడబ్ల్యూసీలో మొత్తం 84 మంది సభ్యులకు 50 ఏళ్లలోపు ఉన్న పలువురు నాయకులు, బలహీన వర్గాలకు చెందిన వారు, 15 మంది మహిళలకు చోటు కల్పించారు. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని రాష్ట్రాలకు వర్కింగ్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

శాశ్వత ఆహ్వానితులు..

CWC శాశ్వత ఆహ్వానితులలో వీరప్ప మొయిలీ, హరీష్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాష్, రమేష్ చెన్నితల, BK హరిప్రసాద్, ప్రతిభా సింగ్, మనీష్ తివారీ, తారిక్ అహ్మద్ కర్రా, దీపేందర్ సింగ్ హుడా, గిరీశరాయ్ చోడంకర్, దామోదర రాజనర్సింహ, T .సుబ్బిరామి రెడ్డి, , చంద్రకాంత హందోరే, మీనాక్షి నటరాజన్, ఫూలోదేవి నేతమ్ మరియు సుదీపరాయ్ బర్మన్. సభ్యత్వం లేని రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లుగా మణిరావు ఠాక్రే, మాణిక్కమ్ ఠాగూర్, చెల్లకుమార్, భక్తచరణ్ దాస్, రాజీవ్ శుక్లా, అజయ్ కుమార్, హరీష్ చౌదరి, సుఖ్‌విందర్ రాంధావా, రజనీ పటేల్, కన్హయ్యకుమార్, గుర్దీప్ సప్పల్, సచిన్ రావ్, మనీష్ . ఛత్ర శాశ్వత సభ్యునిగా కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు.

వీరు కార్యవర్గ సభ్యులు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది సభ్యులు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌధురి, మీరాకుమార్, పి. చిదంబరం, తారిఖ్ అన్వర్, ముకుల్ వాస్నిక్, శశి థరూర్, ఆనంద్ సాస్. ర్మ, సచిన్ పైలట్, కుమారి షెల్జా, సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ సింఘ్వి, కెసి వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, ఎన్. రఘువీరా రెడ్డి, అజయ్ మాకెన్, జితేంద్ర సింగ్, రణ్‌దీప్ సూర్జేవాలా, దీపాస్ మున్షీ, లాల్ తన్హావాలా, అశోక్ రావ్ చవాన్, చరణ్‌జిత్‌సింగ్, గరంగిత్‌సింగ్ తామ్రధ్వాజ్ సాహు, దీపక్ బబారియా, జగదీష్ ఠాకూర్, GA మీర్, అవినాష్ పాండే, మహేంద్రజిత్ సింగ్ మాలవ్య మరియు కమలేశ్వర్ పాటిల్.

నవీకరించబడిన తేదీ – 2023-08-21T03:47:42+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *