బెంగళూరు: చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు పాదయాత్ర చేపట్టారు

– అక్రమ అరెస్టుపై ప్రవాసాంధ్రుల ఆగ్రహం

– పథకం ప్రకారమే కేసుల్లో ఇరికించారని ఆరోపణ

– తమిళనాడు, కర్ణాటక ఐటీ ఉద్యోగులు నిరసనకు మద్దతు తెలిపారు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రవాసాంధ్ర ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలిపారు. బెంగళూరు టీడీపీ ఫోరం, టీడీపీ ఐటీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు హాజరయ్యారు. బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఐటీ ఉద్యోగులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా యావత్ దేశంలోనే ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలిచారని, అలాంటి నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు చూపిన చొరవ వల్లే నేడు ఐటీ రంగంలో నిలదొక్కుకోగలిగామన్నారు. 70 ఏళ్లు దాటిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక మానసికంగా వేధిస్తున్నారని వేదన వ్యక్తం చేశారు.

పాండు1.jpg

చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ప్రవాసాంధ్ర ఐటీ ఉద్యోగులతో పాటు కర్ణాటక, తమిళనాడు ఉద్యోగులు కూడా తరలివచ్చారు. ఈ సందర్భంగా బెంగళూరు టీడీపీ ఫోరం ప్రధాన కార్యదర్శి సోంపల్లి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని, అందుకే ఐటీ ఉద్యోగులు ఆయనకు మద్దతుగా నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజ్యాంగం అమలు జరుగుతోందని, అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తుండడం బాధాకరమన్నారు. గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలులో సమస్యలు లేవని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు అని ప్రశ్నించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఎలాంటి ఆధారాలు లేకుండానే బాబును ఈ కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్టుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల రక్తం ఉడికిపోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రముఖ విద్యావేత్త గురుజాల జగన్మోహన్ అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయని గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ ఉద్యోగులను తయారు చేసి గ్రామ పరిధిలోని యువత భవిష్యత్తును తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ, మహదేవపుర, వైట్ ఫీల్డ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు నిరసనకు తరలివచ్చారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. బెంగళూరు టీడీపీ ఫోరం నాయకులు సోంపల్లి శ్రీకాంత్, కనకమేడల వీరాంజనేయులు, వంశీ మాన్య, పవన్ మోటుపల్లి, శివ, రవి, రాజు, బాలాజీ, నవీన్, పాండు, విజయ్, తెలుగుదేశం నాయకులు పత్తిపాటి అం జనేయులు, సందీప్ తదితరులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *