ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడటం ఇదే తొలిసారి కాదు.

ప్రధాని మోదీ
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చివరి సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరుగుతున్నాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. పాత భవనంలోని ఎన్నో జ్ఞాపకాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యూపీఏ హయాంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి మోదీ ప్రస్తావించారు. ఆ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మోదీ అన్నారు.
ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విభజన ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. ఈ మూడు రాష్ట్రాల విభజన వాజ్‌పేయి హయాంలోనే జరిగింది. విభజన సమయంలో ఈ మూడు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ తెలంగాణ, ఏపీ విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రజలను సంతృప్తి పరచలేకపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఎంతో శ్రమకోర్చి తెలంగాణ ఏర్పాటు జరిగిందని, తెలంగాణ ఏర్పడే సమయంలో రక్తపాతం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ పండుగ చేసుకోలేకపోయిందని, మరోవైపు ఏపీ ప్రజలు కూడా చాలా నష్టపోయారని మోదీ అన్నారు.
నెహ్రూ, ఇందిరలను ప్రశంసించిన మోదీ: నెహ్రూ, ఇందిరా గాంధీలను ప్రధాని మోదీ ప్రశంసించారు
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలో మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదని, విభజన సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.