నటుడు నవదీప్: తెలంగాణ హైకోర్టులో సినీ హీరో నవదీప్‌కు షాక్.. పిటిషన్ కొట్టివేత

నవదీప్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అతడిని అరెస్ట్ చేయవద్దని, 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

నటుడు నవదీప్: తెలంగాణ హైకోర్టులో సినీ హీరో నవదీప్‌కు షాక్.. పిటిషన్ కొట్టివేత

నవదీప్

తెలంగాణ హైకోర్టు : డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. నవదీప్‌పై గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే నవదీప్ గతంలో డ్రగ్స్ కేసుల్లో నిందితుడు కాదని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టుకు వివరించారు. నవదీప్ గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు వివరించారు. అయితే నవదీప్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసులో సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నవదీప్‌ను అరెస్టు చేయవద్దని, 41 సిఆర్‌పిసి నోటీసులు జారీ చేసి విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: నవదీప్ : నవదీప్‌కి డ్రగ్స్ ముఠాతో సంబంధాలు, హైదరాబాద్‌లో తరచూ పార్టీలు.. డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఇటీవల మాదాపూర్‌లోని ప్రెస్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పార్టీలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నవదీప్ తనతో పాటు డ్రగ్స్ తీసుకున్నాడని రామచంద్ర అనే వ్యక్తి చెప్పాడు. దీంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గతంలో నవదీప్‌కు నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ కేసులో నవదీప్‌ను ఏ29గా పేర్కొన్నారు. నోటీసులపై స్పందించి విచారణకు వస్తానని నవదీప్ చెప్పినా.. ఆ తర్వాత నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు.

ఇది కూడా చదవండి: నవదీప్: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతూ నవదీప్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 19 వరకు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో నవదీప్ కేసుపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. నవదీప్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అతడిని అరెస్ట్ చేయవద్దని, 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *