నూతన వధూవరులు వివాహ కేక్ కట్ చేస్తున్నారు. వధువు తనపై కేక్ వేయవద్దని వరుడిని ముందుగానే హెచ్చరించింది. కానీ వాడు వినకుండా ముఖం తడుముకున్నాడు. తర్వాత ఏం జరిగిందో చదవండి.
![Viral News : పెళ్లి పీటలు ఎక్కినందుకు వీళ్ల పెళ్లి క్యాన్సిల్.. ఇదేం వింత? చదువు Viral News : పెళ్లి పీటలు ఎక్కినందుకు వీళ్ల పెళ్లి క్యాన్సిల్.. ఇదేం వింత? చదువు](https://cdn.statically.io/img/diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/09/New-Project-82.jpg?quality=100&f=auto)
వైరల్ న్యూస్
Viral News : పెళ్లి కేక్ కట్ చేస్తున్న కొత్త జంట. ఇంతలో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు.. ఆశ్చర్యకరమైన ఈ ఘటనకు అసలు కారణాలేంటి?
అజ్ఞాత వధువు తన వివాహాన్ని రద్దు చేసుకోవడానికి గల కారణాలను రెడ్డిట్‌లో పంచుకుంది. ఈ ఘటన వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లయిన జంట కేక్ కట్ చేస్తుండగా తన భర్త తన ముఖంపై బలవంతంగా వెడ్డింగ్ కేక్ పెట్టాడని, తన మేకప్, హెయిర్, డ్రెస్ ధ్వంసం చేయడమే కాకుండా తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడని ఆ మహిళ పోస్ట్‌లో పేర్కొంది. అతను చేసిన పని నచ్చక అతనితో పెళ్లి రద్దు చేసుకుంది.
తనకు 17 ఏళ్ల వయసులో పుట్టిన రోజు వేడుకల్లో తన తల్లి కూడా ఇలాగే ప్రవర్తించిందని ఆ మహిళ తన పోస్ట్‌లో రాసింది. తలకు గాయమై ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో తన పుట్టినరోజు మొత్తం పాడైపోయిందని చెప్పింది. ఇలాంటివి చేస్తే వదిలేస్తానని భర్తకు ముందే చెప్పానని, అయితే అతను దానిని జోక్‌గా తీసుకున్నాడని చెప్పింది. కేక్ కటింగ్ సమయంలో కేక్ తీసుకుని తన ముఖంపై బలవంతంగా దింపాడని వధువు రాసింది. ఈ ఘటనను చూసిన తన కుటుంబసభ్యులు, అతని కుటుంబ సభ్యులు తమాషాగా తీసుకున్నారని పోస్ట్‌లో పేర్కొంది. అందుకే భర్త నుంచి విడిపోయానని పోస్ట్‌లో వెల్లడించింది.
రెడ్డిట్ యూజర్లు మహిళ నిర్ణయానికి మద్దతు పలికారు. మీకు నచ్చని విషయం ముందే చెప్పినా.. వినకుంటే.. అలాంటి వ్యక్తితో జీవితాంతం నడవలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మహిళ పోస్ట్ వైరల్ అవుతోంది.
మా పెళ్లి రోజున నా భర్త నా ముఖం మీద కేక్ పగలగొట్టాడు మరియు నేను అతనిని విడిచిపెట్టాను.
ద్వారాu/Mindless-Charge-5996 లోAITAH