PM Modi: తెలంగాణాలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ

PM Modi: తెలంగాణాలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన

ప్రధాని మోదీ – తెలంగాణ పర్యటన: ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీ.. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మహబూబ్‌నగర్‌ వెళతారు. 3.15 నుంచి 4.15 వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి 5 గంటల 05 నిమిషాలకు బేగంపేట చేరుకుని ఢిల్లీ వెళతారు.

ప్రధాని పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగాలు కూడా చేయనున్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..రాజా సింగ్ : హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేస్తాం.. పోలీసులు అడ్డుకుంటే ఏ సమస్య వచ్చినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌ పర్యటనపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ వస్తున్నారని పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఓట్ల వేట కోసమే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌కు వస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల నుంచి కృష్ణా జలాల వాటా తేల్చలేదు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణల వాటా తేల్చిన తర్వాతే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌కు రావాలని డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దేశాన్ని మోసం చేసిన పార్టీ అని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. కొత్త పార్లమెంట్ తొలిరోజే తెలంగాణపై విషం చిమ్మారని కేటీఆర్ సీరియస్ అయ్యారు.

ఇది కూడా చదవండి..తెలంగాణ హైకోర్టు : ఎమ్మెల్యే గొంగిడి సునీతకు హైకోర్టు ఆగ్రహం, భారీ జరిమానా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *