వరల్డ్ కప్ 2023: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి కీలక ఆటగాడు ఔట్?

పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ మధ్య జరగనుంది.

వరల్డ్ కప్ 2023: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి కీలక ఆటగాడు ఔట్?

అష్టన్ అగర్

ఆస్ట్రేలియా ఆటగాడు అష్టన్ అగర్: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో పోటీ చేసేందుకు ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. మరోసారి ప్రపంచకప్ గెలవాలని ఆస్ట్రేలియా జట్టు కసరత్తు చేస్తోంది. అయితే జట్టులోని పలువురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇప్పటికే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియా జట్టులోని స్టార్ ఆల్ రౌండర్ ఆష్టన్ అగర్ గాయం కారణంగా మెగా టోర్నీకి దూరం కానున్నాడని సమాచారం. అగన్ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అగర్ గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకోవడానికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశం కనిపిస్తోంది.

Ind vs Aus 3rd ODI : చివరి వన్డేలో టీమిండియా ఓడిపోయింది.. కానీ సిరీస్ మనదే

దక్షిణాఫ్రికాతో టీ20కి దూరమైన తర్వాత, అష్టన్ అగర్ భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అయితే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో 29 ఏళ్ల ఆష్టన్ అగర్ చోటు దక్కించుకున్నాడు. ఆడమ్ జంపాతో అగర్ స్పిన్ జోడీలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున 22 వన్డేలు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. ఇదిలావుంటే, క్రికెట్ ఆస్ట్రేలియా నేడు ప్రపంచకప్‌కు 15 మంది ఆటగాళ్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అగర్ స్థానంలో యువ ఆటగాడు తన్వీర్ సంఘా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Ind vs Aus 3 వ వన్డే: విరాట్ కోహ్లి లబుషానే ఆటపట్టించాడు.. వీడియో వైరల్

పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబరు 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలోని జట్టు ఆతిథ్య భారత్‌తో తలపడనుంది. అగర్ మెగా టోర్నీకి దూరమైతే ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *