“మధురపూడి గ్రామం అనే నేను” విడుదలకు సిద్ధంగా ఉంది

“మధురపూడి గ్రామం అనే నేను” విడుదలకు సిద్ధంగా ఉంది





“మధురపూడి గ్రామం అనే నేను” అనేది ఒక పల్లెటూరి కథను చెప్పే ఆసక్తికరమైన కథ. శివ కంఠమనేని కథానాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ కళ్యాణ్ రామ్ మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మ మణిశర్మ స్వరపరిచారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కెఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా..

దర్శకుడు మల్లి మాట్లాడుతూ – “డిఫరెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ చేద్దాం, “మధురపూడి గ్రామం అనే నేను” సినిమా తీశాం. ప్రేమ, స్నేహం, రాజకీయం, యాక్షన్, ఎమోషన్ ఇలా ఒక పల్లెటూరిలో ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉంటే అవన్నీ మట్టి కథలో ఉన్నాయి. ఒంగోలు, చీరల నేపథ్యంలో సాగే కథ ఇది. రాజమండ్రి, మచిలీపట్నం మరియు హైదరాబాద్‌లోని చాలా అందమైన మరియు ఆసక్తికరమైన లొకేషన్లలో షూటింగ్ చేసాము. శివకాంతమనేని హీరోగా పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ గా క్యాత్లీన్ గౌడ డిఫరెంట్ రోల్ లో మెప్పించడం ఖాయం. భరణి శంకర్, సత్య, నూక రాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగి ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – “ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా కాన్సెప్ట్‌తో కూడిన మంచి యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 13న “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం’’ అన్నారు.

శివ కంఠమనేని, కాథ్లీన్ గౌడ, భరణి శంకర్, సత్య, నూకరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: మల్లి,







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *